తెలంగాణ
నీరు నిండినా దండగే.. ముందుచూపు లేని పాలనపై రైతుల ఆందోళన!
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ ముందుచూపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఏడు టీఎంసీలు. కానీ భారీగా పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం నిల్వ చేసుకోగలిగేది సుమారు మూడున్నర టీఎంసీల నీరే. ఫలితంగా భారీ వరద వచ్చినా ఆ నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల కడెం ప్రాజెక్టులోకి ఏకంగా లక్షల క్యూసెక్కుల వరద చేరింది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. అంటే ప్రాజెక్టు నిండినా నీరు మిగలని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రాజెక్ట్ ల్లో వాటర్ నిండకుంటే ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. నీరు ఉన్నప్పుడే దాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడంలో ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
