ఏపీ

పులివెందులలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. గాలిలోకి గన్ ఫైర్!..

ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించిన కడప జిల్లా.. కాలం మారుతున్న కొద్దీ ఆ ముద్ర నుంచి బయటపడుతున్నట్టే కనిపించింది. ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అనిపించినప్పటికీ.. అప్పుడప్పుడూ చోటుచేసుకుంటున్న ఘర్షణలు మాత్రం పాత జ్ఞాపకాలను మళ్లీ కదిలిస్తున్నాయి. తాజాగా పులివెందులలో జరిగిన ఘటన ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పులివెందులలో వినాయక మండపం వద్ద ఇద్దరు టీడీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ మధ్య మొదలైన గొడవ క్రమంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు సమాచారం. పుష్పనాథ్ రెడ్డిపై విజయ్ కుమార్ చేయి చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య పరిస్థితి అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.