తెలంగాణ
పోలీసుల వలయంలో జూరాల ప్రాజెక్టు.. రైతుల ధర్నా పిలుపుతో అలర్ట్!
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాగునీటి విడుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా, పంటలను కాపాడుకునేందుకు జూరాల వద్ద భారీ ధర్నా నిర్వహించేందుకు రైతులు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.
