National
స్కూల్స్లో జంక్ ఫుడ్ నిషేధం..
ఇటీవలి కాలంలో పిల్లలు జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడిపోతున్నారు. జంక్ ఫుడ్ కారణంగా పోషకాహారానికి దూరమవుతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే జబ్బుల బారిన పడుతున్నారు. వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారుతోంది. ఈ క్రమంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కట్టడిపై కర్నాటక ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా స్కూళ్ల క్యాంటీన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో జంక్ ఫుడ్ విక్రయాలను పూర్తి బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు. పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంపొందించేందుకు ఈ దిశగా యోచన చేస్తున్నట్లు వివరించారు. అంతేకాదు ఆసుపత్రి క్యాంటీన్లలోనూ జంక్ ఫుడ్ బ్యాన్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు మంత్రి ఖాదర్.
