తెలంగాణ
TG: జూబ్లీహిల్స్‌లో ఆడి కారు యవ్వారం.. తాగిన మైకంలో 4 గంటల హైడ్రామా
TG: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి వేళ భారీ హైడ్రామా చోటుచేసుకుంది. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ లగ్జరీ కారు డ్రైవర్, ఏకంగా నాలుగు గంటల పాటు నడిరోడ్డుపై పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడు. కారు దిగడానికి నిరాకరిస్తూ, విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి తీవ్ర గందరగోళం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన AP 15 BL 0555 నంబర్ ఆడి కారును పోలీసులు ఆపారు. డ్రైవర్‌కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అతడు తాగి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది.
