క్రైమ్
సంచలనంగా మారిన జోగి కుటుంబ వ్యవహారం.. వైరల్ అవుతున్న రాజీవ్ వ్యాఖ్యలు!..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోగి కుటుంబానికి సంబంధించిన ఓ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలో రాజీవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పెళ్లి విషయంలో తనకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని రాజీవ్ ఆరోపించినట్లు తెలుస్తోంది. అమ్మాయి ఫొటో చూసినప్పుడే తనకు ఎలాంటి భావన కలగలేదని.. పెళ్లి తర్వాత పరిస్థితి మారుతుందేమోనని భావించినా.. చివరకు తాను దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోయానని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తనకు లైంగిక పరమైన సమస్య ఉందని ముందే చెప్పినా.. కుటుంబ సభ్యులు తన మాట వినకుండా బ్రెయిన్‌వాష్ చేసి పెళ్లికి ఒప్పించారని రాజీవ్ ఆరోపణలు చేసినట్లు వైరల్ అవుతున్న ఆడియోలో వినిపిస్తుంది.
