దునియా

Jio: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు కాన్వా ప్రో ఫ్రీ! ఇలా పొందండి..

Jio: రిలయన్స్ జియో తమ యూజర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న ప్రముఖ విజువల్ డిజైన్ ప్లాట్‌ఫామ్ ‘కాన్వా’ తో జియో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అర్హులైన కస్టమర్లకు ఏకంగా ఏడాది పాటు కాన్వా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులకు ఇది ఊహించని గుడ్ న్యూస్‌గా మారింది.సాధారణంగా వేల రూపాయలు వెచ్చిస్తే తప్ప దక్కని కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్లను జియో యూజర్స్ ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా కేవలం ప్రీమియం టూల్స్ మాత్రమే కాకుండా.. కాన్వా ప్రో లైట్ యూజర్లకు 50 జీబీ, కాన్వా ప్రో వినియోగదారులకు ఏకంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అదనపు బెనిఫిట్‌గా లభించనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి ఈ సరికొత్త ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అర్హత కలిగిన యూజర్లు ‘మైజియో’ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.