National

రేపు పబ్లిక్ ఇష్యూకు ‘జియో’.. రూ.2.5 లక్షల కోట్ల బిడ్స్ దాఖలు!

స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు రిలయ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రిస్‌ సిద్ధమైంది. రేపు జియో తొలిసారి పబ్లిక్ ఇష్యూ (IPO)కు రానుంది. దేశీయ టెలికాం, డిజిటల్ రంగాల్లో కీలకంగా మారిన జియో ఐపీవో అక్టోబర్ 21న ప్రారంభంకానుంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగుస్తుంది. రెండ్రోజుల పాటు పబ్లిక్ ఇష్యూ కొనసాగనుంది. దీనికి ఇప్పటికే అపూర్వ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. రూ.8,110 కోట్ల యాంకర్ బుక్‌కు ఏకంగా 30 రెట్లకు పైగా (రూ.2.5 లక్షల కోట్లకు పైగా) బిడ్లు దాఖలైనట్టు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ఐపీవో ద్వారా సుమారు రూ.30 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేర్ల ధరల శ్రేణిని రూ.1,065 - 1,119గా నిర్ణయించింది. ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి ప్రకారం కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.