National

జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంత్రివర్గంలోని కీలక నేత హఠాన్మరణం పొందారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి సుదివ్య కుమార్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హర్‌సింగరాయ్‌డీహ్‌లోని తన నివాసంలో ఇవాళ ఉదయం తీవ్రమైన ఛాతినొప్పితో ఆయన బాధపడినట్టు తెలిసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గిరిడీహ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి సుదివ్య కుమార్ మరణవార్త తెలియడంతో ఆయన కుటుంబీకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.