టాప్ న్యూస్
జేఈఈ మెయిన్ 2027 పరీక్షా తేదీల షెడ్యూల్ విడుదల
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్ -2027 అధికారిక షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. 2027 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి సెషన్-1, సెషన్-2 పరీక్షా తేదీల పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన తేదీలు, వివరాలను అధికారులు వెల్లడించారు. దేశంలోని ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమైంది. నవంబర్ 22న రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలిపే ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్’ను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు.
