రాజకీయాలు

మనకు జయశంకర్ గురువు.. సీఎంకు చంద్రబాబే గురువు : కేటీఆర్

మనకు ప్రొఫెసర్ జయశంకర్ గురువు అయితే.. సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబే గురువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మరోసారి తల్లడిల్లుతోందని చెప్పారు. నీటి వాటా విషయంలో రాష్ట్రానికి మళ్లీ అన్యాయం చేసేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని, కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఆడిస్తోందన్నారు. అదే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ పవర్‌లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు.