Janwada Farmhouse: జన్వాడ ఫామ్ హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకు ఇచ్చా.. ముట్టడిస్తే కేసులు పెడతా : ప్రదీప్‌రెడ్డి
Janwada Farmhouse: తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్న జన్వాడ ఫాంహౌస్ వివాదం మరింత వేడెక్కింది. శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులు ఫాంహౌస్‌ను ముట్టడించేందుకు రెడీ అవుతున్న టైంలో, ఆ ఆస్తి అసలు యజమాని ప్రదీప్ రెడ్డి రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలతోనే తన వ్యక్తిగత ఆస్తిని వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.మాజీ మంత్రి కేటీఆర్‌తో తనకున్న సంబంధాలపై ప్రదీప్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. "జన్వాడ ఫాంహౌస్ నా కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తి. కేటీఆర్ నాకు చిన్ననాటి ఫ్రెండ్ కావడంతో, 2019లో దీనిని ఆయనకు లీజు ఇచ్చా. ఇందులో ఎలాంటి సీక్రెట్స్, అక్రమాలు లేవు. కేవలం కేటీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యం కారణంగానే కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆయన వివరించారు..
