జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు బీజేపీకి షాకిచ్చిన జనసేన!
తెలంగాణ బీజేపీకి ఎన్డీయే మిత్రపక్షమైన జనసేన పార్టీ బిగ్‌షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా దీనికి జనసేన స్టేట్ చీఫ్ శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు అంశం రాంచందర్ రావు పరిధిలోని అంశం కాదని.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.దీనికి తోడు బీజేపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంటే.. కమలం పార్టీ నేతలే ఇతర పార్టీలోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. వీరంతా క్షేత్రస్థాయిలో ఇంతకాలం బీజేపీ కోసం సీరియస్‌గా పనిచేసిన నేతలు అని తెలుస్తోంది.
