తెలంగాణ

జనసేన ఎంపీ కొడుకును అరెస్టు నుంచి తప్పించలేదు : డీసీపీ రితిరాజ్

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద రెండ్రోజుల కిందట జరిగిన కారు ప్రమాదంలో లైఫ్‌స్టైల్‌లో పనిచేసే ఓ యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మృతికి కారణమైన ఏపీ జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ ప్రస్తుతం బయటే తిరుగుతున్నట్టు సమాచారం. ఆయన్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదని తెలిసింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితుడిని నేటికి అరెస్టు చేయకుండా విచారణ పేరిట మాదాపూర్ పోలీసులు కాలయాపన చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, డబ్బులకు అమ్ముడుపోయారా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ.. మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో సంజూష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదో డీసీపీ రితిరాజ్ వివరణ ఇచ్చారు.