క్రైమ్
JailorArrested: జైలర్‌గా విధులు.. అదే జైలులో ఖైదీ అయిన అధికారి!
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మహిళా ఖైదీల వేధింపులు, అధికార దుర్వినియోగం కేసులో పరారీలో ఉన్న మాజీ జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఖైదీలను జైలు నిబంధనలకు విరుద్ధంగా బయటకు తీసుకెళ్లి తన సొంతింట్లో పనులు చేయించుకున్న కేసులో గత రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆమెను సైబర్ సెల్ సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
