సినిమా

Jailer-2-Ranabaali: బ్లాక్ బస్టర్ సీక్వెల్‌కి ఇంకా బిజినెస్ డీల్ క్లోజ్ అవలేదా?

Jailer-2: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి జైలర్ 2. బ్లాక్ బస్టర్ జైలర్ కి సీక్వెల్ అనే విషయం అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్య కృష్ణన్, యోగి బాబు, మీర్నా మరియు రిత్విక్ సీక్వెల్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇక, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, అన్నా రాజన్.. ఇప్పుడు రెండవ భాగంలో జాయిన్ అయ్యారు. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ అందుకున్న జైలర్ సీక్వెల్ మూవీకి ఇంకా బిజినెస్ క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.