తెలంగాణ

Jagga Reddy: సోనియాగాంధీ ఆత్మకథపై సినిమా తీస్తాడట.. అవసరమా జగ్గారెడ్డి?

Jagga Reddy: రాజకీయాల్లో హైలైట్ అవ్వడానికి నేతలు రకరకాల వేషాలు వేస్తుంటారు, లేనిపోని స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అయితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన తాజా ప్రకటన చూస్తే మాత్రం కాంగ్రెస్ శ్రేణులే అవాక్కవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తాను తెలుగులో ఒక భారీ సినిమా తీయబోతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. అంతేకాదు, సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే దీనికి నిర్మాతలని, నాయకులంతా డబ్బులు రెడీ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. పైకి ఇది అధినేత్రిపై ఉన్న అభిమానంలా కనిపిస్తున్నా.. అసలు విషయం హైకమాండ్ మెప్పు పొంది మైలేజ్ సాధించడమేనని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ టైమ్‌లో ఇలాంటి ప్రకటనలు జగ్గారెడ్డికి అవసరమా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.