ఏపీ

టాప్ గేర్‌లో జగన్.. కూటమికి కొత్త టెన్షన్! డీఎస్సీపై ఆధారాలతో దూకుడు

ప్ర‌తిపక్షంలో జగన్‌ యాక్టివ్‌గా లేరు అనే విమర్శలు ఇంత‌కాలం వినిపించాయి. కానీ ఇప్పుడు డీఎస్సీ అంశాన్ని ఎత్తుకొని, ఉద్యోగార్థుల సమస్యను రాజకీయ అస్త్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత‌. కూటమి ప్రభుత్వానికి ఇది ప్రతిపక్ష ఆరోపణగా తీసిపారేయగల అంశం కాదు. ఎందుకంటే ఇది యువత ఉద్యోగాల విషయం. మెరిట్ విషయం.