తెలంగాణ

నేను చచ్చిపోతేనే నిధులు ఇస్తారా? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నేను చచ్చిపోతేనే జడ్చర్లకు నిధులు ఇస్తారంటే చావడానికైనా సిద్ధమే అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. రూ.40 కోట్లు విలువనా? లేదా నా ప్రాణం విలువనా? అనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లు పూర్తి చేయకుంటే 30వేల మందితో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా అని రేవంత్ సర్కార్ ను ఆయన హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నా చావుతోనే స్పందిస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధులు, పెండింగ్ బిల్లుల కోసం కొట్లాడేందుకు సిద్ధమన్నారు.