క్రైమ్
'నన్ను కిడ్నాప్ చేశారు' అంటూ ప్రియురాలికి మెసేజ్.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు!
సరదాగా చేసిన ఒక పని ముగ్గురు యువకులను ఊహించని విధంగా కష్టాల్లోకి నెట్టింది. మద్యం మత్తులో ప్రియురాలికి పంపిన ఒక అబద్ధపు సందేశం, చివరకు వారి ఫ్లాట్‌లో దాచిపెట్టిన అక్రమ బెట్టింగ్ సొమ్మును పోలీసుల ముందు బట్టబయలు చేసింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి ప్రాంతానికి చెందిన దేశినేని సుమంత్, మాకాటి మనోజ్, కనుమూరి గౌతమ్ అనే ముగ్గురు యువకులు కేపీహెచ్‌బీలోని 'ఇండిస్ వన్ సిటీ' గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు.
