వ్యాపారం
మెటాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇటలీ.. ఏకంగా రూ.7,400కోట్ల భారీ జరిమానా!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) సంస్థకు ఇటలీలో ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారుల ప్రత్యేక అనుమతి లేకుండా వారి స్మార్ట్ఫోన్ గ్యాలరీలోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేసినట్లు రుజువు కావడంతో ఇటలీ డేటా పరిరక్షణ నియంత్రణ సంస్థ మెటాపై కొరడా ఝళిపించింది. యూరోపియన్ గోప్యతా చట్టాలను ఉల్లంఘించినందుకు గాను మెటాకు ఏకంగా 805 మిలియన్ యూరోలు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.7,400కోట్ల భారీ జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
