National
ఇస్రోలో ప్రైవేటీకరణ ప్రకంపనలు..! రాకెట్లు ఇక ప్రైవేట్ చేతుల్లోకేనా?
ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు తొలిసారి సమష్టిగా గళం విప్పాయి. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్‌కు రెండ్రోజుల కిందట లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానం ఏంటి? భవిష్యత్‌లో ఇస్రో పాత్ర ఏమిటి? వంటి అంశాలపై అధికారిక వివరణ ఇవ్వాలని కోరాయి.
