రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు : మన్నె క్రిశాంక్
రాష్ట్రంలో మరోమారు టెస్సరాక్ట్ కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కంపెనీతో ఇజ్రాయెల్ ప్రతినిధులు తాజాగా ఒప్పందాలు చేసుకున్నారని, అలా ఎలా సాధ్యం అయ్యిందని బీఆర్ఎస్ కీలక నేతల మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డికి కీలక ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు.సీఎం రేవంత్ చెప్పడం వల్లే ఇజ్రాయెల్ ప్రతినిధులు కొండల్ రెడ్డి కంపెనీ అయిన టెస్సెరాక్ట్‌తో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ సంవత్సరం దావోస్‌కి వెళ్లి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ వాళ్లని కలిశారని, వాళ్లు అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు.
