తెలంగాణ

రోహింగ్యా ఓట్ల కోసమే కదా? పొన్నంకు బీజేపీ చీఫ్ కౌంటర్

ఎస్ఐఆర్‌లో భాగంగా ఓట్లు కోల్పోయిన వారిని తీసుకొస్తానని, చర్చకు రావాలని మంత్రి పొన్నం విసిరిన సవా‌ల్‌కు తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బోగస్ ఓట్లు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీనే బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా ఆ విషయంపై సింఘ్వీని వివరణ కోరాలని హితవు పలికారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ ఓట్లు తొలగిపోతున్నందుకే కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి ధర్నాలు చేస్తోందని విమర్శించారు. కాగా, రాంచందర్ రావు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.