క్రీడలు
పాక్ క్రికెట్ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత వివాదాలు మరింత కలకలం రేపుతున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షాహీన్షా అఫ్రిది మధ్య నెలకొన్న కెప్టెన్సీ విభేదాలే పాక్ క్రికెట్ పతనానికి ప్రధాన మూలకారణమని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను పాకిస్థాన్ 0-2తో దారుణంగా కోల్పోయిన అనంతరం టీవీ షోలో మాట్లాడిన ఆయన, బాబర్ బలమైన కెప్టెన్ కాదని, ఆటగాళ్ల మధ్య గొడవలు ప్రారంభమైన రోజే పాక్ క్రికెట్ నాశనమైందని విమర్శించారు.
