తెలంగాణ

ఇది శాసనసభనా లేదా కౌరవ సభనా? : హరీశ్ రావు

రాష్ట్రంలో పాలనా వైఫల్యం, ప్రతిపక్ష నేతల మీద పోలీసుల దాడులపై తెలంగాణ భవన్ బయట మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్యుల రక్షణ సంగతేంటని ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్యంలో ఈరోజు బ్లాక్ డే.రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు నొక్కి దాడి చేశారు. పబ్లిక్‌గా పోలీసులు మా మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారు.ఆ రోజు దుర్యోధనుడు ప్రవర్తించినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు.సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు తోస్తే ఇనుప చువ్వల మీద పడేది.. ఆమె చేయి పట్టి లాగి మా మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాపాడింది.మా సోదరి సునీతమ్మ చీర లాగిన, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులు సప్త సముద్రాలు దాటి దాక్కున్నా వదిలిపెట్టం.. మీకు తగిన గుణపాఠం చెప్తాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.