స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
KhammamCommandControlScam:టెండర్ ఏదైనా వాటాల లొల్లి?
కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో రాష్ట్రానికి 25 శాతం, లోన్స్ రూపంలో 50 శాతం సమకూర్చుకునే నిధుల టెండర్స్పై రాష్ట్ర ప్రభుత్వం పర్సంటేజీలతో పరేషాన్ చేస్తోంది. అర్హత పేరుతో 1 లేదా 2 కంపెనీలకే అవకాశం ఉండేలా చూస్తోంది. 20 శాతం నుంచి 30 శాతం కమీషన్ ఇస్తేనే మీకు టెండర్ వస్తుందని ముందే తెగేసి చెప్పేస్తున్నారు. అది భరించే సంస్థలకే ఇస్తామని చెప్పడంతో అర్హత ఉన్నా చాలామంది కాంట్రాక్టర్స్ వెనకడుగు వేస్తున్నారు. ప్రధాని ఏక్తామాల్ నిర్మాణంలో రూ.100 కోట్లు ఇప్పటికే ఎస్కలేషన్ పేరుతో లేపేశారు.
