ఏపీ
మాజీ డీజీపీ సవాంగ్‌కు బిగుస్తున్న ఉచ్చు?
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలవ్వగా..2019 మే 26న ప్రిలిమ్స్, 2020 డిసెంబరులో మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం మాన్యువల్ విధానంలో జవాబుపత్రాల మూల్యాంకనం జరగాలి, కానీ కోవిడ్ ఉందన్న కారణంతో డిజిటల్ మూల్యాంకనం చేశారు. అక్కడే పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రిసార్టులో జరిగిన మూల్యాంకనంపై కోర్టు సీరియస్ అవ్వడంతో కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ మరల విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయంలో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయించారు. అయితే, మాన్యువల్ మూల్యాంకనం, డిజిటల్ ఫలితాలకు ఏకంగా 62% వ్యత్యాసం వచ్చింది. దీంతో వందలాది పేపర్లలో దిద్దుబాట్లు జరిగినట్టు అభ్యర్థులు ఆరోపించారు. దీని వెనుక సవాంగ్ కుట్ర పన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
