తెలంగాణ
యాక్సిడెంట్ కేసు పక్కకేనా?.. సీఎం చంద్రబాబుతో ఆర్ట్ డైరెక్టర్
ఏపీకి చెందిన కీలక వ్యక్తులు, నేతల కొడుకులు హైదరాబాద్‌లో యాక్సిడెంట్స్ చేసి ప్రాణాలు తీస్తున్నా తెలంగాణ పోలీసులు వారి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఇటీవల మాదాపూర్‌లో ఓ యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్ మీద ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం అతను బయటే తిరుగుతున్నాడని ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే రాయదుర్గంలో కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారాం.నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి పోలీసులు అతడిని పట్టుకున్నారు. సందీప్‌ను రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా అతనికి కండీషన్ బెయిల్ దొరికింది.
