క్రీడలు
టీమిండియా కొత్త సెలక్టర్ ఎంపికలో రోహిత్ శర్మ భవిష్యత్తే కీలకం?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో మాజీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్ పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సీఏసీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలు అభ్యర్థులకు వర్చువల్గా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూల సందర్భంగా భారత జట్టు భవిష్యత్ ప్రణాళికలు, ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపు, 2027 వన్డే ప్రపంచకప్లో ఆయన భాగస్వామ్యంపై దరఖాస్తుదారులకు అత్యంత పదునైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్లో 39 ఏళ్ల రోహిత్ శర్మను కొనసాగించాలా వద్దా? అనే అంశంపై అజిత్ అగర్కర్, బీసీసీఐ పెద్దల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం.
