స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
రేవంత్రెడ్డి కమీషన్ల దందా? టెండర్లలో భారీ అక్రమాలపై సంచలన లేఖ!!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కాంట్రాక్టర్ల పట్ల అనుసరిస్తున్న వైఖరి, టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలపై నిర్మాణ రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. ఇటీవల రేడియల్ రోడ్ల (HGCL) టెండర్ల అవినీతిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణల వివాదం ముగియకముందే, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ (RVM Constructions) మేనేజింగ్ డైరెక్టర్ నామా రమేశ్ "బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా" (BAI) అధ్యక్షుడికి రాసిన సంచలన లేఖ బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది.
