తెలంగాణ
రేవంత్ బినామీ?.. KLSR కన్స్ట్రక్షన్స్పై వలస కూలీల ఆగ్రహం!
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. చేసిన పనికి వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయంలో జీతాలు చెల్లించకపోతే ఇంటికి డబ్బులు ఎలా పంపించాలని ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో నిర్మిస్తున్న ఎడ్యుకేషనల్ హబ్లో ఈ వలస కూలీలు పనిచేస్తున్నారు. అయితే, ఆ ప్రాజెక్టు మెయింటెన్ చేస్తున్న KLSR కన్స్ట్రక్షన్స్ తమకు కూలి డబ్బులు చెల్లించడం లేదంటూ ఇవాళ ఉదయం నిరసనకు దిగారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయనకు ఫిర్యాదు చేస్తామని కూలీలు చెబుతున్నారు. గత కొంతకాలంగా కేఎల్ఎస్ఆర్ కంపెనీ కూలి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని యూపీ, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నకూలీలు ఆరోపిస్తున్నారు.
