స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
తెలంగాణలో పడకేస్తున్న పాలన?
రాష్ట్రంలో రెండే విషయాలు నడుస్తున్నాయి. రైతుల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ అనుచరుల ఆగడాలు. అన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ అధోగతిలా పడి ఉంటోంది.ఎవరు ఎవరి మాటా వినని పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఆశ చూపిన వారికి, ముఖ్యమంత్రికి వీళ్లు దగ్గర అనే వ్యక్తులకు మాత్రమే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలో ఇప్పటికే చేసేశారని టాక్.కానీ,వాళ్లు రోడ్డు మీద పడి సెటిల్మెంట్లు అంటూ ఎన్నో ఆగడాలు సృష్టిస్తున్నారు. 1. జానారెడ్డి కుమారులు రాజకీయంగా ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారు. స్కూల్స్ టెండర్స్లో ఎవరు ఎన్ని చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడంతో ఆ కోటాలో రూ.80 కోట్లు కొట్టేశారు.మరో టెండర్స్లో అలానే సంపాదించారు.ఇవి కాకుండా మరిన్ని చేసుకునేందుకు ఫైల్స్ సిద్ధమయ్యాయి.
