తెలంగాణ
పాలిటెక్నిక్ భూములపై సీఎం రేవంత్ కన్ను?
రాష్ట్రవ్యాప్తంగా 60 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా.. వాటికి చెందిన భూములును కాజేయాలని రేవంత్ సర్కార్ పన్నాగం పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటి విలువ సుమారు రూ 30,000 కోట్ల ఉంటుందని అంచనా వేశాయి. అందుకే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీలో విలీనం చేయాలని కుట్రకు తెరలేపారని ప్రచారం జరుగుతోంది.ఇంజినీరింగ్ చేసిన విద్యార్ధుల కన్నా ఎక్కువగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్ధులకే తొందరగా ఉద్యోగాలు వస్తుండటం ఆ కాలేజీలు,కోర్సులు ఎంత అవసరమో నిరూపిస్తున్నాయి. అయితే, రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీ పెద్దగా ఆదరణ లభించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. పాలిటెక్నిక్ కాలేజీలకు ఉన్న రూ.వేల కోట్ల భూమి మీద రేవంత్ కన్ను పడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
