ప్రపంచం
Iran Crisis: దివాలా అంచున ఇరాన్.. 380% రేట్లు పెరిగిన నిత్యవసర సరుకులు.. ఆకలి రాజ్యంగా మారుతుందా..?
దశాబ్దాల పాటు చమురు సంపదతో తులతూగిన గల్ఫ్ దేశం ఇరాన్లో ఇప్పుడు మానవతా సంక్షోభం పరాకాష్టకు చేరింది. యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఆంక్షలు, స్థానిక కరెన్సీ ‘రియాల్’ పతనం అన్ని కలిపి దేశాన్ని ద్రవ్యోల్బణ విషవలయంలోకి నెట్టేశాయి. ఒకప్పుడు పెట్రో-డాలర్లతో విర్రవీగిన నేలపై.. ఇప్పుడు ప్రజలు పూట గడవడం కోసం తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సైతం దారిద్య్రరేఖకు దిగువకు జారుకుంటున్నాయి.
