International
హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై ఇరాన్ దాడి.. వీడియో రిలీజ్!
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఓ భయానక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. 2026 ఏప్రిల్ 22న 21 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న పనామా జెండాతో కూడిన 'యూఫోరియా' అనే కంటైనర్ నౌకపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు దాడి చేసిన దృశ్యాలను ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) విడుదల చేసింది.
