క్రీడలు

ఐపీఎల్‌ సూపర్ స్ట్రైకర్ అవార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఖరీదైన బహుమతి!

 యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో ఖరీదైన బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) టోర్నమెంట్‌లో అసాధారణ బ్యాటింగ్ ప్రతిభ కనబరిచి 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును కైవలం చేసుకున్నాడు. ఈ మేరకు వైభవ్‌కు  టాటా సంస్థ ఖరీదైన 'టాటా సియెర్రా ఎస్‌యూవీ' (Tata Sierra SUV) కారును అందించింది. వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌కు వెళ్లి పసుపు రంగు సియెర్రా కారు ముందు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.