వ్యాపారం
iPhone18Pro: డబ్బులది ఏముందిలే.. చేతిలో ఐఫోన్ ఉండాలి అంతే!
ఒక వైపు ధర చూస్తే లక్షల మాటే. మరోవైపు స్టోర్ తెరిచేది ఉదయం 8గంటలకైతే, జనాలు మాత్రం ముందు రోజు రాత్రి నుంచే క్యూ లైన్లలో నిలబడుతున్నారు. సాధారణంగా ఏదైనా పండుగ లేదా జాతర ఉంటేనే జనంతో కిక్కిరిసిన దృశ్యాలు కనిపిస్తాయి. కానీ, యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా అదొక పెద్ద వేడుకలా మారిపోతుంది. ‘కొంటే ఐఫోనే కొనాలి, అది కూడా అమ్మకానికి వచ్చిన రోజే చేతిలో పడాలి’ అనే ఐ ఫోన్ లవర్స్ ముందు ఈ ధరలు, గంటల తరబడి నిరీక్షణలు చిన్నవిగా మారిపోయాయి.
