క్రైమ్
Investment Scam: "లడ్డూ" కావాలా నాయనా.. అంటూ పరిచయాలు.. ఆపై 3.45 కోట్లకు టోకరా.. మైహోం భూజాలో భారీ మోసం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైహోం భూజాలో భారీ మోసం వెలుగుచూసింది. కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ బయటపడింది. గణేశ్ లడ్డూ వేలంలో లడ్డూలు కొనుగోలు చేసి అపార్ట్ మెంట్ వాసుల్లో గుర్తింపు పొందిన వ్యక్తి భారీ మోసానికి తెరలేపాడు. తన మాయ మాటలతో అపార్ట్ మెంట్ వాసులను నమ్మించి నిండా ముంచేశాడు. భారీ లాభాల ఎరతో వారి నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు.
