తెలంగాణ
సచివాలయంలో ఇంటర్నెట్ డౌన్.. స్తంభించిన ప్రభుత్వ కీలక కార్యకలాపాలు!
తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం సాంకేతిక లోపం కారణంగా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ప్రభావంతో సచివాలయ ప్రాంగణంలోని పలు కీలక శాఖల రోజువారీ పాలనా వ్యవహారాలు, పౌర సేవలు తీవ్రంగా స్తంభించిపోయాయి. సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు, ఉద్యోగులు సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సచివాలయంలోని మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్ఆర్ఐ (NRI) అసిస్టెన్స్ సెల్ వంటి ప్రాధాన్యత కలిగిన విభాగాల్లోనూ నెట్వర్క్ సేవలు నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
