International
భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..
వీసాల జారీలో కఠిన వైఖరి ప్రదర్శిస్తోన్న అమెరికా.. ఇప్పుడు భారత్‌కు మరో షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉపాధి ఆధారిత EB-1 గ్రీన్ కార్డ్ లు భారత దరఖాస్తుదారులకు రాబోయే కొన్నివారాల్లో అందుబాటులో ఉండకపోవచ్చని హెచ్చరించింది. భారతీయుల నుంచి భారీ డిమాండ్ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
