International

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి

హిమాలయాలను ఆనుకుని ఉన్న టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. నిన్న సాయంకాలం వేళ 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 16 మంది మరణించారు. 54 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భూమి లోపల 10 కిమీటర్ల దూరంలో కౌంటీకి 70 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. టిబెట్‌లో ఒక్కసారిగా భారీ కదలికలతో భూమి కంపించగా విద్యుత్, టెలికమ్యూనికేషన్, రోడ్ వ్యవస్థ కూడా భారీగా దెబ్బతిన్నట్టు సమాచారం.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు టిబెట్ దేశంలో భారీ భవనాలు సైతం నేలమట్టం అయినట్టు సమాచారం.