క్రైమ్
ప్రాణం తీసిన ఇన్స్టాగ్రామ్ పరిచయం.. హోటల్ రూమ్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి!
ఇన్స్టాగ్రామ్ పరిచయం ఓ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రాణాలను బలిగొంది. హన్మకొండలో పీజీ (పీడియాట్రిషన్) మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన కె.సృజన (27) అనే విద్యార్థిని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న ఓ హోటల్ గదిలో దారుణ హత్యకు గురైంది. పథకం ప్రకారమే ఆమెను హోటల్‌కు పిలిపించిన నిందితుడు, దిండుతో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా కడతేర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం సృజనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా రవికుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
