National
రాహుల్ సభలో మోదీపై స్కిట్.. భగ్గుమన్న బీజేపీ!!..
ఇండోర్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన ‘ఛాత్రోంకీ గుంజ్’ కార్యక్రమం ఇప్పుడు పొలిటికల్ ఫైర్‌కు కారణమైంది. ప్రధాని నరేంద్ర మోదీ హావభావాలను స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి అనుకరిస్తూ స్కిట్ చేయగా.. ఆ సమయంలో రాహుల్ గాంధీ కూడా వేదికపైనే ఉన్నారు. దీంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్.. ఈ ప్రదర్శనను అసభ్య ప్రవర్తన, చౌకబారు ట్రోలింగ్‌గా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయ సంస్కృతి యువతలో రాహుల్ గాంధీపై ప్రభావం చూపదంటూ విమర్శలు గుప్పించారు.
