National
ఇండోనేషియాను వణికిస్తున్న ప్రకృతి.. భూకంపాలతో పాటు సునామీ!..
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తీర ప్రాంతాలను వణికించాయి. ఫ్లోరెస్‌లోని ఎండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అంతర్జాతీయ భూకంప పరిశీలనా సంస్థలు వెల్లడించాయి. ప్రధాన ప్రకంపన తర్వాత నిమిషాల వ్యవధిలోనే వరుసగా ప్రకంపనలు, ఆఫ్టర్‌షాక్‌లు సంభవించినట్లు సమాచారం. భూకంపం ధాటికి ఫ్లోరెస్ తీర ప్రాంతంతో పాటు పరిసర పట్టణాల్లో భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
