తెలంగాణ

Indiramma Indlu: రూ.5లక్షల సబ్సిడీతో 10అంతస్తుల ఫ్లాట్లు.. హైదరాబాద్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్‌ పరిధిలోని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాన్ని నేడు(మంగళవారం) ప్రారంభించింది. తొలి విడతగా హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నారు. నియోజకవర్గానికి 480 చొప్పున మొత్తం 7,680 ఫ్లాట్లను 10 అంతస్తుల భారీ భవనాల్లో నిర్మించనున్నారు. ఇందులో ప్రభుత్వం రూ. 5లక్షలను ఉచిత సబ్సిడీగా అందిస్తుండగా, మిగిలిన రూ. 6 లక్షలను లబ్ధిదారులు నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది.