తెలంగాణ
Indiramma Housing Towers: లక్ష ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు రేపే భూమిపూజ
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు రేపు భూమి పూజ జరగబోతోంది. హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ ప్లాట్లను నిర్మించబోతున్నారు. క్యూర్ పరిధిలో 12వేల ప్లాట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. తొలి విడతలో 18 ప్రాంతాల్లో 7 వేల 340 ప్లాట్ల నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.807 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది సర్కార్.
