తెలంగాణ
Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు.. వాళ్లను నమ్మి మోసపోవద్దు
Indiramma Houses Scheme: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఎల్ఐజీ గృహాల లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను ఈ వారంలోనే అందజేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పి.వి.గౌతం తాజాగా స్పష్టం చేశారు. దీంతో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా పూర్తి చేశారు. పారదర్శక పద్ధతిలో నిర్వహించిన కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా తొలుత 7,340 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వకుండా.. అధికారులు స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.
