తెలంగాణ

ఇందిరమ్మ ప్రచారం అట్టర్ ప్లాప్.. బిల్లులు రాలేదని ఆగ్రహం

సీఎం రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు స్కీం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇస్తామని ప్రకటించిన సర్కార్.. ఆ తర్వాత జాగా ఉన్నవారికే కేటాయిస్తామని కొర్రీలు పెట్టింది. అయితే, ఇందిరమ్మ ఇంటికి రూ.5 ఇస్తున్న ప్రభుత్వం.. అది కూడా ఒక్కసారిగా ఇవ్వడం లేదు. ముందు లబ్దిదారులు తమ సొంత పైసలతో ఇంటి నిర్మాణం ప్రారంభించాక.. విడతల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇదిలాఉండగా, నిన్న దీపావళి పండుగ సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’పేరిట ప్రభుత్వం కొత్త ప్రచారానికి తెరలేపింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయి అందులో ఉంటున్న లబ్దిదారులతో కలిసి ప్రభుత్వం ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అయితే, సర్కారు భావించినంతగా ఈ ప్రచారం విజయవంతం కాలేదని తెలుస్తోంది. ఎందుకంటే చాలా చోట్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని మాత్రమే తుది దశకు చేరుకోగా.. మరికొన్నింటిలో మాత్రమే ప్రజలు గృహప్రవేశం చేసి ఇళ్లల్లోకి వచ్చారు.