National
ఇందిరా గాంధీ వర్ధంతి.. జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ!
భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆమెతో గడిపిన మధుర బాల్య జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు. తమ నాయనమ్మతో కలిసి ఉన్న అరుదైన చిన్ననాటి ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టులు పెట్టారు. రాహుల్ గాంధీ తన 'దాదీ' (నాయనమ్మ) ఇందిరా గాంధీ ఒడిలో కూర్చుని, ఆమె చేతులు పట్టుకుని యజుర్వేదంలోని శాంతి మంత్రం విన్న క్షణాలను గుర్తుచేసుకున్నారు.
